'అమరన్'లో సాయి పల్లవి చేసిన పాత్ర ఎవరిది.. తెలిస్తే గుండె బరువెక్కుతుంది?

praveen

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించిన 'అమరన్' మూవీ మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.150-200 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో శివ కార్తికేయ లీడ్ రోల్ ప్లే చేస్తే.. సాయి పల్లవి అతని ప్రియురాలు, భార్య పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా రీల్ కథ కాదు రియల్ కథ అన్న సంగతి అందరికీ తెలిసినదే. దాంతో సాయిపల్లవి పాత్ర మీద జనాలకు చాలా ఆసక్తి మొదలైంది. సాయి పల్లవి 'ఇందు రెబకా వర్గీస్' పాత్రను పోషించింది. అయితే ఎవరీమె? ఆమె గురించి తెలిసిన తర్వాత ఆమె గురుతులు మీ మదినుండి బయటకు వెళ్లడం కష్టం.
అవును, ముకుంద్ వరదరాజన్ మహా మొండివాడు. అందరూ అతడి మొండితనాన్ని చూస్తే.. ఇందు మాత్రం అతని మంచి మనసును చూసింది. ప్రాణం కన్నా దేశభక్తి మాత్రమే ఎక్కువ అని నమ్మిన అతడు ఆమెకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే అతడ్ని స్నేహితుడిగా కాకుండా జీవిత భాగస్వామిగా స్వీకరించేందుకు ఆమె సిద్ధపడింది. అయితే, అదంత తేలిగ్గా జరగలేదు. ఎందుకంటే.. ముకుంద్ తమిళ బ్రాహ్మణ కుటుంబం. ఇందూ కేరళకు చెందిన క్త్రైస్తవ అమ్మాయి. ఇద్దరి పరిచయం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జరగా ఇందును ముకుంద్ ఇష్టపడ్డారు. అదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఆ వెంటనే ఆమె ఓకే చేయడంతో పాటు, ఇంట్లో కూడా చెప్పేసింది. ఎప్పటిలానే వ్యతిరేకత వ్యక్తమైంది.
అయితే, ఇక్కడ గొడవ కులం.. మతం విషయంలో కాదు. అతనికి సైనికుడు అవ్వాలన్న అతడి కెరీర్ ప్లాన్ ఇందు కుటుంబానికి అస్సలు నచ్చలేదు. దాంతో కూతురికి నో చెప్పారు. ఈ క్రమంలో వారు మంచి సమయం కోసం ఎదురు చూసారు. ముకుంద్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరి, తక్కువ సమయంలోనే కెప్టెన్ అయ్యాడు. కట్ చేస్తే, ఐదేళ్లు ఓపిగ్గా రెండు కుటుంబాల వారిని ఒప్పించి.. రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గురుతుగా రెండేళ్ల పాప కూడా పుట్టింది. దాంతో పాటు మేజర్ గా ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్ కు సెలెక్ట్ అయ్యి, జమ్మూకశ్మీర్ కి బదిలీ అయ్యాడు.
ఇక్కడే వారి జీవితం మలుపు తిరిగింది. 2014లో ఓ ఆఫరేషన్ లో పాల్గొన్న ముకుంద్.. టీంను మందికి నడిపే సమయంలో ప్రత్యర్ధులు పెద్ద ఎత్తున కాల్పులు చేసారు. తక్షణమే తన వారికి సాయం చేసేందుకు రంగంలోకి దిగిన ముకుంద్.. తీవ్రవాదుల్ని మట్టుబెట్టి, విజయంతో బయటకు వచ్చారు. ఆ వెంటనే కుప్పకూలారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనకు అశోక చక్రను ప్రకటించింది. దాన్ని అందుకున్న వేళ.. ఇందు నోటి నుంచి వచ్చిన ఒక మాట అందరినీ కట్టిపడేసింది. 'దేశ ప్రజలు చూడాల్సింది నా బాధను కాదు. ఆయన ధైర్యాన్ని గుర్తించండి!' అంటూ ఆమె అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక వారి ఐదేళ్ల వైవాహిక జీవితంలో ముకుంద్ తో కలిసి ఉన్నది కొద్ది నెలలే అయినప్పటికీ ఆమె ఇంటి బాధ్యతను తీసుకున్నారు. భర్త విజయాల్నే తన విజయాలుగా భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: