జాన్వి కపూర్ కి తెలుగు జనాలలో నచ్చనిది అదేనా..? ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?

Thota Jaya Madhuri
స్టార్ హీరోస్ ని హీరోయిన్స్ ని చాలా చాలా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు జనాలు. మరి ముఖ్యంగా తెలుగు జనాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది . ఎందుకంటే మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్స్ ఒక హీరోని హీరోయిన్ ఇష్టపడతారు ..సినిమా చూస్తారు ఎంజాయ్ చేస్తారు ..పాజిటివ్ కామెంట్స్ చేస్తారు. అంతే కానీ తెలుగు జనాలు మాత్రం అది ఫ్యాన్ ఫాలోయింగ్ గా కాదు వాళ్లను దేవతలుగా దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు.


మరి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎలా ఆరాధిస్తూ ఉంటారో జనాలు మనకు తెలిసిందే. ఆయన ఒక హీరోగా కాకుండా దేవుడిగా చెప్పుకొస్తూ ఉంటారు.  అలాగే అభిమానిస్తూ ఆయన కోసం ఏమైనా చేస్తూ ఉంటారు . కాగా మరి కొంతమంది స్టార్ హీరోస్ కి కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  అయితే జాన్వీ కపూర్ అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె కు ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది.


దానికి జాన్వీ అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. " నేను కూడా తెలుగు జనాలు బాగా లైక్ చేస్తాను.. బాగా అభిమానిస్తారు.. ఆరాధిస్తారు...  తెలుగు జనాలు చాలా చాలా మంచివారు కూడా..చాలా బాగా చూసుకుంటారు .. కానీ వాళ్ళు అభిమానంతో చేయి కోసుకొని ఆ బ్లడ్ తో బొమ్మలు వేయడం..పేర్లు రాయడం.. స్టార్స్ ని కలవడానికి అంతంత దూరాలు నడిచి రావడం ..ఆరోగ్యాన్ని కేర్ చేయకుండా పలు పనులను చేయడం.. ఎందుకో  నాకు అంతగా నచ్చదు .. అలా కాకుండా ఫ్యాన్స్ ని స్టార్స్ ని స్టార్స్ గా ఇష్టపడి అభిమానిస్తే బాగుంటుంది "అంటూ చెప్పుకు వచ్చింది . నిజానికి జాన్వి కపూర్ చెప్పింది చాలా నిజం. స్టార్స్ కోసం కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉంటారు . ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ మరొక స్టార్ హీరో ఫ్యాన్స్ గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.  అలా కాకుండా స్టార్ ని స్టార్ గా అభిమానిస్తే ఏ బాధ ఉండదు . జాన్వీ ఎంత ఓపెన్ గా చెప్పడంపై ఫాన్స్ కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: