"ఆ మరక మంచిదే గా".. బయట పడ్డ ఉపాసన టాప్ సీక్రేట్..!

Thota Jaya Madhuri
ఉపాసన ..రాంచరణ్ భార్య . మెగా ఇంటికోడలు . ఇలా ట్యాగ్ చేయించుకోక ముందు ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి గారి మనవరాలు . చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది . జనాలు అంటే చాలా చాలా ఇష్టం . జనాలు హ్యాపీగా హెల్తీగా ఉండడానికి ఆమె మొదటి నుంచి తన స్థాయిలో కృషి చేస్తూ ఉంటుంది. కాగా మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఉపాసన గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మెగా ఫ్యాన్స్ నే  కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా సెలబ్రిటీస్ ఉపాసన మంచితనాన్ని చాలా సార్లు పోగిడేశారు.


 తన - మన భేదం లేకుండా సహాయం అని ఇంటికి వచ్చినవారికి కోట్లలో సహాయం చేస్తూ ఉంటుంది ఉపాసన . అంతేకాదు ఎక్కడ తన అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా రేణూ దేశాయ్ కి ఎటువంటి హెల్ప్ చేసిందో మనం చూసాం . అయితే తాను చేసిన సేవలు గురించి బయట పెద్దగా చెప్పుకోదు ఉపాసన . చాలా సింప్లిసిటీ . సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి . తన భర్త రామ్ చరణ్ అదే విధంగా తన కూతురు క్లింకారను చాలా ప్రేమగా కేర్ఫుల్గా చూసుకుంటూ వస్తుంది.  అయితే ఉపాసన గురించి అందరికీ ఒక యాంగిల్ మాత్రమే తెలుసు . ఆమెలోని మరో క్వాలిటీ మాత్రం అతి తక్కువ మందికే తెలుసు .


కాగా ఉపాసనకు సంబంధించిన సెకండ్ యాంగిల్ కూడా బయటపడింది. ఉపాసన ఎంత మంచి అమ్మాయో..? అంత మొండి అమ్మాయి కూడా.  ఆమె అనుకున్న పనిని కరెక్ట్ గా టయానికి చేసేస్తుంది .ఎనిమిది గంటలకు అక్కడ ఈవెంట్ లో ఉండాలి అంటే 7:50కి ఉంటుంది. అంత పక్క ప్లానింగ్ మనిషి.  అంతేకాదు తనతో ఉన్నవాళ్లు కూడా అంతే ప్లానింగ్ గా ఉండాలి అంటూ భావిస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ టైం కి అస్సలు ఏ ఈవెంట్ కి వెళ్ళడు . ఉపాసన చెప్పిన టైం కంటే పది నిమిషాలు ముందే అక్కడ ఉంటుంది. మరి వీరిద్దరికి ఎలా సెట్ అయిందో ఆ దేవుడికి తెలియాలి . బహుశా అదే ప్రేమంటేనేమో అంటున్నారు జనాలు .


అయితే ఉపాసన చాలా చాలా మొండిది అని ..తనని చీట్ చేసిన వారిని అస్సలు వదలదని కచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేస్తుంది అని ..మరీ ముఖ్యంగా డబ్బు విషయం కారణంగా ఎవరైనా అబద్ధాలు చెప్తే ఆమె లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది అని ..అలాంటి వాళ్ళని అసలు  కేర్ కూడా చేయదు అని ఆమె దగ్గర స్నేహితులు మాత్రమే ఈ విషయం తెలుసు అని ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు  అయితే మెగా ఫాన్స్ మాత్రం ఆ మరక మంచిదేగా ..తనను చీట్ చేసిన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం ఇంకా బెటర్ ..ఆ మరక ఉపాసనకు ఎప్పుడు మంచిదే ..ఉపాసనకు ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి సీక్రెట్ ఇదే కాబోలు అంటూ పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: