టాలీవుడ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజు , వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా కృష్ణాష్టమి అనే సినిమాను నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు చెప్పుకుచ్చాడు. కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... మా బ్యానర్ లో వాసు వర్మ "జోష్" అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆయనతో రెండవ సినిమా చేయాలి అనుకున్నాను.
చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన కొన వెంకట దగ్గర ఉన్న ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీని తీసుకున్నాడు. ఇక ఆ కథను నాకు వినిపించగా నాకు అది చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ కథ కోసం హీరోని వెతికే పనిలో పడ్డాము. కొంత కాలం పాటు హీరో దొరకలేదు. ఆ టైం లో మేము ఖాళీగా ఉండకుండా ఆ కథలో ఎలాంటి మార్పులు చేస్తే సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుంది అని దానిపై చాలా వర్క్ చేసి ఆ కథలో అనేక మార్పులు చేశాం.
ఇక ఆ తర్వాత సునీల్ ను ఆ కథకు హీరోగా ఎంచుకున్నాం. ఇక సునీల్ ను హీరోగా ఎంచుకొని సినిమా స్టార్ట్ చేశాం. సినిమా పూర్తి అయ్యి విడుదల అయింది. కానీ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. చివరగా సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కోన వెంకట్ ఇచ్చిన కథను అలాగే తీసిన బాగుండేది అనవసరంగా మార్పులు చేశాం అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.