మొదటి పెళ్లిలో పొందలేని ఆ ఆనందం..రెండో పెళ్లిలో పొందుతున్నాడా..నాగచైతన్య బోల్డ్ డెసిషన్..!

Thota Jaya Madhuri
పాపం..ఏ ముహూర్తాన రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడో కానీ అప్పటినుంచి నాగచైతన్యను ఏకీపారిస్తున్నారు జనాలు. మరి ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో బూతుల వర్షం కురిపిస్తున్నారు. మనకు తెలిసిందే నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అది రెండో పెళ్లి . మొదట హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం చేశాక వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు కూడా  తీసుకున్నారు .


అయితే ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు . రీసెంట్ గానే వీళ్ళ నిశ్చితార్ధం  చాలా సింపుల్ గా అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది . ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభించేశారు.  రీసెంట్గా జరిగిన ఏఎన్ ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కాబోయే కోడలిని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ నాగార్జున ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి స్వయంగా పరిచయం చేశారు . అమితాబచ్చన్ కూడా శోభిత ధూళిపాళ్లతో చాలా చక్కగా మాట్లాడారు .


అంతేకాదు ఏఎన్ఆర్ ఈవెంట్స్ లో ఈ జంట చాలా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . అయితే నాగచైతన్య పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఏ విధంగా బయట పెట్టడం లేదు. దీని వెనక ఏదో రీజన్ ఉందా..? అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . కాగా మొదటి పెళ్లి విషయంలో చాలా చాలా హంగామాలు చేసి .. ఆ పెళ్లి జీవితం అలాగే ఫ్లాప్ అయిపోయింది అని.. పెళ్లికి సంబంధించిన మూమెంట్స్ ని ఎంజాయ్ చేయలేకపోయారు అని.. అందుకే రెండో పెళ్లి విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా చాలా పక్కాగా సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేయాలి .. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అని.. ఆ కారణంగానే సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి నానా రకాల ట్రోలింగ్ కి గురవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు  నాగచైతన్య అంటున్నారు జనాలు . ఏమో నాగచైతన్య తీసుకున్న నిర్ణయం ఎంత వరకు కరెక్టో తెలియదు కానీ మొదటి పెళ్లిలో పొందలేని ఆనందాన్ని రెండో పెళ్లిలో అయినా పొందుతాడు లేదో అంటూ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: