తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి కిరణ్ వరస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి.
చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ నటుడు తాజాగా "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు మొదట ఈ మూవీ బృందం వారు అనౌన్స్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్ ను చేసింది. అందులో భాగంగా ఈ సినిమా హీరో అయినటువంటి కిరణ్ మాట్లాడుతూ ... ఈ మూవీ ని మొదట తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయాలి అనుకున్నాము.
కానీ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా మలయాళం లో పెద్ద స్థాయిలో విడుదల కానుంది. దానితో మేము మలయాళం లో మా సినిమాను విడుదల చేయడం లేదు. ఇక తమిళ్లో మాకు థియేటర్స్ దొరకలేదు. దానితో తమిళ్లో కూడా మా సినిమాని విడుదల చేయడం లేదు. ఇక అక్టోబర్ 31 వ తేదీన కేవలం "క" సినిమా తెలుగు భాషలో మాత్రమే విడుదల కానుంది. ఆ తర్వాత సినిమాకు మంచి టాక్ వస్తే ఇతర భాషల్లో ఆ తర్వాత వారం తర్వాత విడుదల చేస్తాం అని కిరణ్ ప్రకటించాడు.