శారీలో ఘాటు అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్న రాజమౌళి హీరోయిన్..

Suma Kallamadi

శ్రీయ శరన్ ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులతో చేసింది ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో చాలా అందంగా ఉంటుంది. సంతోషం, నేనున్నాను సినిమాలో ఈ అందాల తార బ్యూటిఫుల్ గా కనిపించే అందరికీ డ్రీమ్ గర్ల్ అయ్యింది. తరువాత దిగ్గజ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. ప్రభాస్, శ్రీయ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వీరి రొమాంటిక్ సీన్లు వేరే రేంజ్ లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆమె నటించిన "గుండు సూది" పాట చాలామంది ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ బ్యూటీ దీపావళి సందర్భంగా హాట్ హాట్ అందాలు వడ్డిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో బాంబులు వదిలింది. సోషల్ మీడియా తన హాట్ ఫోటోలతో ఊపేస్తోంది. ఓ ప్రముఖ పార్టీలో పర్పుల్, బ్లాక్ సీక్విన్ శారీలో అందంగా కనిపించింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ శారీలో శ్రీయ శరన్ అందాల దేవతలా కనిపిస్తోంది. ఆమె వేషం పండుగ వైభవంతో పాటు అందమైన శైలిని కలిగి ఉంది.
శ్రీయ శరన్ దీపావళి పండుగ సందర్భంగా జరిగిన పార్టీకి వెళ్లింది. ఆ పార్టీలో ఆమె వేసుకున్న దుస్తులు చాలా అందంగా ఉండడంతో అందరూ ఆమెని చూసి ముగ్ధులయ్యారు. ఈ సారీ చాలా అందంగా ఉండటమే కాకుండా, దీపావళి పండుగకు తగినట్లుగా వైభవంగా కూడా ఉంది. శ్రీయ శరన్ ధరించిన శారీ మీద ఉన్న మెరిసే ఫ్యాషన్ డీటెయిల్స్ ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఆమె ఆ పార్టీలో ఒక రాణిలా కనిపించింది. ఆమె ఫోటోలను చూసిన వారంతా ఆమె అందం గురించి ప్రశంసలు కురిపిస్తూ మురిసిపోతున్నారు.
శ్రీయ తన అందమైన నవ్వుతో, చక్కని పోజులతో తన అందాన్ని మరింత పెంచింది. ఆమె ఎంతో కాన్ఫిడెంట్ గా తన అందాలు షో చేసింది. ఫ్యాషన్ గురించి చాలా బాగా తెలిసిన శ్రీయ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్‌గా ఉండే వారిలో ఒకరు అని మరోసారి నిరూపించింది. ఈ పండుగ సీజన్‌లో ఆమె తన అభిమానులను, ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుందని అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: