కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కు వెళ్లినట్లయితే భారతదేశంలో ఒక్కొక్కరు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనేవారు. దానితో భారత జనాభా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దానితో ఒకానొక దశలో భారతదేశంలో ప్రపంచం లోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో నెంబర్ వన్ స్థాయికి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దానితో కేంద్ర ప్రభుత్వాలు దేశంలో కొత్తగా జన్మిస్తున్న పిల్లల జనాభా సంఖ్యను తగ్గించడం కోసం కేవలం దంపతులు ఇద్దరి కంటే మించి పిల్లలను కనకూడదు అనే ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇక ఆ తర్వాత కాలం మారే కొద్ది కొత్తగా పెళ్లి అయిన వారు కూడా పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఇద్దరు మరికొందరు ఒకరితోనే పిల్లల్ని కనడం ఆపివేస్తూ వస్తున్నారు.
దానితో దేశంలో కొత్తగా జన్మిస్తున్న పిల్లల జనాభా సంఖ్య చాలా వరకు తగ్గింది. ఇకపోతే మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గు ముఖం పట్టింది. దానితో రాబోయే కాలంలో వృద్ధుల సంఖ్య ఎక్కువ గాను , యువత సంఖ్య చాలా తక్కువ గాను ఉండే పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా కనబడుతుంది. దానితో ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు ముఖ్యమంత్రులు వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి అనే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , కేరళ , కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల నేతలు రాబోయే కాలంలో వృద్ధుల సంఖ్య ఎక్కువ యువత సంఖ్య తక్కువ అవుతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
యువత సంఖ్య దక్షిణాది రాష్ట్రాలలో రాబోయే కాలంలో భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు బలంగా రావడంతో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీటిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే కాలంలో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీలైనంత ఎక్కువ శాతం యువత జనాభా రాబోయే కాలంలో రాష్ట్రాలలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి యువత జనాభాను పెంచేందుకు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి చర్యలను తీసుకుంటారో చూడాలి.