యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. లేకపోతే ఇప్పటివరకు ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఇప్పటికి కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ను కనబరుస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే 25 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో నాలుగవ స్థానంలో నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 272.31 కోట్ల కలక్షన్ లను వసూలు చేసే మొదటి స్థానంలో నిలవగా , బాహుబలి 2 సినిమా 204 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది.
ఇక కల్కి 2898 AD సినిమా 187.27 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలవగా , దేవర పార్ట్ 1 మూవీ కేవలం 25 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగి సేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 159.54 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఇప్పటికే వసూలు చేసింది.