మోక్షజ్ఞ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజు నుంచే వేట మొదలు..!

Amruth kumar

నట సింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ  ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు .. ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ సినిమా ఇప్పటి కే ఓకే అయింది .. క్లాప్‌ కొట్టడాని కి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది .. ఈ సినిమా ని లాంఛ‌నం గా ప్రారంభించబోతున్నారట . జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని కూడా అంటున్నారు . ఈ సినిమా లో మోక్షజ్ఞకు జంటగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ర‌వీనా టాండ‌న్  కూతురు ర‌షా త‌థానీ ఇప్పటి కే హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది .

ఇప్పటికే ఆమెపై ఓ లుక్ టెస్ట్ కూడా చేసినట్టు టాలీవుడ్ నుంచి సమాచారం అందుతుంది . అలాగే ఈ సినిమాలో విలన్ గా పలువురు అగ్ర హీరోల పేర్లను పరిశీలిస్తున్నారట .. అందులో ప్రధానంగా హీరో రానా కూడా ఉన్నాడ ని తెలుస్తుంది .. అయితే రానా హీరో గా ఓ సినిమా రాబోతుంది .. ఈ రెండు సినిమాల కు డేట్ క్లాష్‌ వచ్చే అవకాశం ఉన్నందున రానా ఎటు తేల్చుకోలేక పోతున్నారని కూడా అంటున్నారు .

ఈ సినిమా లో బాలయ్య సైతం ప్రత్యేక పాత్రలో కనిపించినారు .. అయితే అది అతిథ మాత్రం మాత్రమే అని క్లైమాక్స్ లో బాలయ్య పాత్ర ఎంట్రీ ఉంటుందని అంటున్నారు .. ఇక పురాణాలతో టచ్ ఉన్న కథ కాబట్టి మోక్షజ్ఞ క్యారెక్టర్ అభిమన్యుడు పాత్రకు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే నందమూరి కళ్యాణ్ లేదా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా లో ప్రత్యేక పాత్ర లో నటించే అవకాశం ఉంద ని కూడా అంటున్నారు . మోక్ష‌జ్ఞ అభిమన్యుడు అయితే బాల‌య్య పాత్ర క‌చ్చితంగా శ్రీ‌కృష్ణు డే. తొలి సినిమా లో తండ్రీ కొడుకుల్ని ఒకేసారి ఒకే తెర‌పై చూడ‌డం , అది కూడా పౌరాణిక పాత్ర‌ల్లో.. ఇంత‌కంటే ఫ్యాన్స్‌కు కావ‌ల్సిందేముంది .. ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: