పవన్ కళ్యాణ్ చేసిన ఆ ఒక్క పని.. ప్రభాస్ జీవితానే టోటల్ మార్చేసిందిగా..!
సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమైనప్పటికీ కొందరు ఫాన్స్ మాత్రం ఆ విషయాలను చాలా ఎక్కువగా పర్సనల్గా తీసుకుంటూ ఉంటారు . అలా ఎంతోమంది స్టార్ హీరో ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు . వాళ్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించారు . చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు . పలు కారణాల చేత ఆయన మంచి మంచి సినిమాలను చేతికి వచ్చినా కూడా రిజెక్ట్ చేశాడు . వాటిల్లో ఒకటే డార్లింగ్ మూవీ . కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .
కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాను ముందుగా డైరెక్టర్ కరుణాకర్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలనుకున్నారట . పవన్ కళ్యాణ్ కి స్టోరీ కూడా వినిపించారట. చాలా ఇంప్రెస్ అయ్యారట. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఈ కథ తన బాడీకి సూట్ అవ్వదు అంటూ ఈ కథను రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ఈ స్టోరీ ను చాలా మంది హీరోస్ దగ్గరికి తీసుకెళ్లిన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట . ఫైనల్లీ ప్రభాస్ ఈ స్టోరీని ఓకే చేశారు .
ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింత స్థాయిలో పెరిగిపోయింది. మరి ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది . ప్రభాస్ జీవితాన్ని టోటల్ గా మార్చేసింది డార్లింగ్ మూవీ. కాగా పవన్ కళ్యాణ్ ఆరోజు ఆ సినిమాను మిస్ చేసిన ఒకే ఒక్క కారణంగా ప్రభాస్ టోటల్ లైఫ్ ఏ మారిపోయింది . అఫ్కోర్స్ అంతకుముందు ప్రభాస్ హిట్లు అందుకున్నాడు . కానీ ప్రభాస్ ని ఎక్కువగా జనాలకు అదే విధంగా ఫ్యామిలీస్ కు అదే విధంగా అమ్మాయిలకు దగ్గర చేసిన వన్ అండ్ ఓన్లీ సినిమా డార్లింగ్ . అందుకే ఈ డార్లింగ్ మూవీ ఆయన లైఫ్ లో చాలా చాలా స్పెషల్. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు..!