"ఆ అదృష్టవంతుడు ప్రభాస్ ఒక్కడే"..ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడ్చుకునేలా చిరంజీవి మాటలు..!

Thota Jaya Madhuri
ప్రభాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు . అది ఆయన ఫ్యాన్ అయినా.. పక్క హీరో ఫ్యాన్ అయినా.. సామాన్య జనాలైనా.. ఎవ్వరైనా సరే ప్రభాస్ ని ఇష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఆయన మంచితనం . ఎదుటి వాళ్లకి లేదు కాదు అనకుండా ప్రభాస్ సహాయం చేసే మనస్తత్వం ఉన్నవాడు.  అంతే కాదు అందరికీ కడుపునిండా భోజనం ఉండేలా ప్రభాస్ చూసుకుంటూ ఉంటాడు . ఆయన వర్క్ చేసే ప్రతి షూటింగ్ కి టెక్నీషియన్స్ కి స్టార్ హీరో హీరోయిన్స్ కి ప్రభాస్ నే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొస్తాడు అన్న విషయం కూడా అందరికీ తెలుసు .


కాగా గతంలో ఓ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరొకసారి ట్రెండ్ అవుతుంది. నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రెబెల్ ఫాన్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను సోషల్ మీడియా వేదిక ట్రెండ్ చేస్తున్నారు.  అందులో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది . "ఆది పురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ స్టేజిపై ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు .


"ఈ మధ్య నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయనను ఒక విషయం అడిగారు అని.. నువ్వు రామాయణం  చేస్తున్నావా అంటూ అడిగారు అని..యస్ సార్ అంటూ ఆన్సర్  చెప్పగా ఆయన వెంటనే హగ్ చేసుకుని మరి వెరీ గుడ్.. ఇలాంటి స్టోరీస్ కొందరికే సెట్ అవుతాయి అందులో ఒకరివే నువ్వు.. నిజంగా లక్కీ పర్సన్ ..రాముడి గెటప్ లో కనిపించడం అంటే మామూలు విషయం కాదు ..ఆ అదృష్టవంతుడివి నువ్వే గుడ్ లక్..ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇండస్ట్రీకి కావాలి "అంటూ ప్రభాస్ భుజం తట్టి చెప్పుకొచ్చారట.


ఇదే విషయాన్ని ప్రభాస్ ఆది పురుష్ ఈవెంట్ లో  చెప్పుకొచ్చాడు . అదే వీడియోని మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు . అంతేకాదు నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ రెబల్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. " ఆ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ " అంటూ ప్రభాస్ కి చాలా స్పెషల్ గా మెగాస్టార్ బర్త డే విషెస్ చెప్పారు . అంతేకాదు చాలామంది స్టార్స్ కూడా ట్విట్టర్ వేదికగా విషెస్ చెబుతున్నారు.  అయితే కోట్ల మంది ఫ్యాన్స్ ఎదురుచూసిన ఆ పెళ్లి అప్డేట్ మాత్రమే ఇంకా రాలేదు.  ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన అప్డేట్ వస్తుందా..? రాదా ..? అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ప్రభాస్ తన పెళ్లి కబురు ఎప్పుడు అందిస్తాడో..??



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: