దేవర కంటే పవన్ మూవీ బిజినెస్ తక్కువా.. ఆ ఒక్క తప్పు వల్లే నష్టం జరిగిందా?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాల షూటింగ్స్ సజావుగా జరగడం లేదనే సంగతి తెలిసిందే. ఓజీ, హరిహర వీరమల్లు 2025 సంవత్సరంలో రిలీజ్ అవుతాయని ప్రచారం జరుగుతున్నా పవన్ షూటింగ్స్ లో పాల్గొంటే మాత్రమే ఈ సినిమాల షూటింగ్స్ చెప్పిన విధంగా పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
 
పవన్ సినిమాల షూటింగ్స్ పూర్తి కాకపోవడంతో ఆయన సినిమాల హక్కులను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 120 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవగా పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఒక సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు 108 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
 
వాస్తవానికి పవన్ సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మార్క్ ను అందుకోలేదు. వేర్వేరు కారణాల వల్ల భీమ్లా నాయక్ మూవీ ఈ రికార్డును అందుకోవాల్సి ఉన్నా సాధ్యం కాలేదు. పవన్ కళ్యాణ్ తన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసినా సినిమాలను కచ్చితంగా ప్రమోట్ చేస్తారని చెప్పలేమనే సంగతి తెలిసిందే.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ ఆలస్యం ఓటీటీ డీల్స్ పై కూడా ప్రభావం చూపుతోంది. పవన్ షూటింగ్ సెట్స్ లో ఎప్పటినుంచి పాల్గొంటారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమాలు ఆశించడం మాత్రం అత్యాశే అని తెలుస్తోంది. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలలో ఏ సినిమా మొదట థియేటర్లలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది.  పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏంటనే ప్రశ్నకు సైతం సరైన సమాధానం దొరకాల్సి ఉంది. ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: