ఒక్క ఫైట్ కూడా లేకుండా.. సూపర్ హిట్ అయిన బాలయ్య మూవీ ఏదో తెలుసా?
అయితే ఆయన ఫాలోయింగ్ నేటికీ కొనసాగుతూ ఉండడం చాలా అరుదైన విషయమనే చెప్పుకోవాలి. వీటికి మించి బాలయ్య సినిమాలో యాక్షన్ పార్ట్స్ గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు! బాలయ్య ఫైట్లు కోసం ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. ఊర మాస్ ఫైట్లు కావాలంటే బాలయ్య సినిమా చూడాల్సిందే. అలాంటి బాలయ్య సినిమా కోసం కేవలం ఫైట్స్ చూడడం కోసమే చాలామంది జనాలు థియేటర్లకు పరుగులు తీస్తూ ఉంటారు. అయితే బాలయ్య చేసిన ఒక సినిమాలో ఫైట్లు లేవంటే మీరు నమ్ముతారా? అదే సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయింది.
ఆ సినిమా పేరు 'నారి నారి నడుమ మురారి.' సరిగ్గా 1990 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాలయ్య సినిమా కెరీర్ కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొత్తం కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ తప్పితే యాక్షన్ పార్ట్స్ కి ఆస్కారం లేకుండా తెరకెక్కించాడు దర్శకుడు కోదండరామిరెడ్డి. ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి రచయితగా వ్యవహరించడం విశేషం. సినిమాలో శోభన, నిరోష హీరోయిన్లగా నటించగా కైకాల సత్యనారాయణ, శారద చాలా ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి, కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ ని పట్టుకొని తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక బాలకృష్ణ కత్తి పట్టకుండా, తొడ కొట్టకుండా చేసిన ఈ సినిమా బాలకృష్ణ సినిమా కెరియర్ లోనే చాలా ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. ఆ సంవత్సరానికి గాను ఈ సినిమా అన్ని విభాగాల్లోనూ అవార్డులను కొల్లగొట్టింది. దాంతో ఓ మాస్ హీరో కూడా క్లాస్ సినిమాను తీసి కిట్టు కొట్టవచ్చు అనే విషయాన్ని రుజువు చేశాడు మన బాలయ్య.