అది లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వేస్ట్.. జనాలు దేకనే దేకరు..!

Thota Jaya Madhuri
అందం.. పలుకుబడి ..రేజ్.. బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో  సెటిల్ అయిపోతారా..?  నో వే అది జరగనే జరగదు అని ప్రూవ్ చేశారు ఇక్కడ ఈ ఇద్దరి హీరోలు.  ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు.  నాన్న పేర్లు తాతల పేర్లు బ్యాక్ గ్రౌండ్  చూసుకొని ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు  కూడా బోలెడు మంది . అయితే వాళ్ళందరూ సక్సెస్ అయ్యారా ..? అని అడిగితే మాత్రం నో అనే చెప్పాలి . దానికి ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీ . మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . అయితే ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వలేదు అన్న విషయం మనకు తెలిసిందే .
సాయిధరమ్ తేజ్ యావరేజ్ హీరోగా మారారు.  వరుణ్ తేజ్ కూడా అంతే . రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా రాజ్యమేలేస్తున్నారు . అయితే ఒకప్పుడు మెగా అండ చూసుకోని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ఫెడవుట్ అయిపోయాడు . అదే విధంగా పంజా వైష్ణవ్  తేజ్ సినిమా అవకాశాలు లేక ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం . అలాగే అల్లు ఫ్యామిలి నుంచి వచ్చిన అల్లు శిరీష్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో హిట్స్ కొట్టిన ఆ తర్వాత అవకాశాలు లేక ఫెడవుట్ అయిపోయాడు.
అంతేకాదు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీగా పాపులారిటీ సంపాదించుకున్న అక్కినేని ఇంటి నుంచి వచ్చిన అఖిల్ ఇప్పటివరకు హిటే కొట్టలేదు. దీంతో జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ ప్రూవ్ చేసింది ఏంటి అంటే బ్యాక్ గ్రౌండ్ ఉన్న సపోర్టు ఉన్న మనలో టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉన్న దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతే ఇండస్ట్రీలో ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా వేస్ట్ అన్నది నిజం అంటూ వీళ్లు ప్రూవ్ చేశారు . అంతేకాదు జనాలు సైతం స్టార్ స్టేటస్ ఉన్న మనలో చెప్పుకోదగ్గ మ్యాటర్ లేకపోతే దేకనే దేకరు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: