ఆ విషయంలో అడ్డంగా బుక్ అయిన చిరంజీవి-బాలకృష్ణ.. ఆఖరికి సొంత ఫ్యాన్స్ కూడా తిట్టేలా చేసుకున్నారుగా..!
చిరంజీవి: మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . పలువురు ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చే విధంగా ఆయన పేరుని మార్చుకున్నాడు. అలాంటి చిరంజీవిని హ్యూజ్ రేంజ్ లో ట్రోళ్ చేసారు జనాలు . ఒకానొక మూమెంట్లో మెగా అభిమానులు కూడా చిరంజీవి చేసింది తప్పే అంటూ మండిపడ్డాడు . చిరంజీవి .. ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే తో ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . ఎప్పుడు హీరోయిన్స్ తో చాలా పద్ధతిగా నడుచుకునే చిరంజీవి ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డేను హగ్ చేసుకుంటున్నట్లు కనిపించి చరణ్ ను పక్కకు తప్పుకో అంటూ సరదాగా మాట్లాడారు . చిరంజీవి మనసులో దురుద్దేశం ఏమీ లేదు . కానీ ఎదుటి వాళ్ళకి అది చాలా చాలా ఇబ్బందికరంగా అనిపించింది . ఆ టైంలో చిరంజీవిని చాలా ట్రోల్ చేశారు.
బాలకృష్ణ: నందమూరి బాలకృష్ణ అంటే ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోపం ఎక్కువే.. మంచితనం కూడా ఎక్కువే. అయితే బాలకృష్ణ కూడా కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కున్నారు . "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ఈవెంట్ లో అంజలితో ప్రవర్తించిన తీరు కారణంగా ఆయన చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అంజలి కూడా అలా బాలయ్య ప్రవర్తించిన దాని పై క్లారిటీ ఇచ్చిన సరే ట్రోలింగ్ మాత్రం ఆగలేదు . అయితే బాలకృష్ణ అటువంటి విషయాన్ని పెద్దగా ఏమీ పట్టించుకోలేదు . సైలెంట్ గా ఉండిపోయాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఆయన చేసిన పని తప్పే అంటూ కొంతమంది మాట్లాడుకున్నారు. ఇలా చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు..!