శృతిహాసన్ నిజంగానే ఆ సినిమా నుండి తప్పకుందా... ఎందుకు సగం షూటింగ్ అయిపోయాక శృతిహాసన్ ఆ సినిమా నుండి తప్పకుందా..శృతిహాసన్ సినిమాలో నుండి తప్పుకోవడానికి కారణం అడివి శేష్ తో ఉన్న గొడవేనా..అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. అడివి శేష్, శృతిహాసన్ కాంబినేషన్లో డెకాయిట్ అనే సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్ గా శృతిహాసన్ తప్పకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే డెకాయిట్ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయిందట. కానీ సడన్ గా ఈ సినిమా నుండి శృతిహాసన్ పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది.అయితే శృతిహాసన్ వేరే సినిమాకి డేట్స్ ఇవ్వడం కారణంగా డేట్స్ విషయంలో గొడవ జరిగి డెకాయిట్ మూవీ నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్టు దర్శక నిర్మాతలకు చెప్పిందట.
అయితే ఈ విషయం విన్న నిర్మాత ఇప్పటికే సగం షూటింగ్ అయిపోయిన శృతిహాసన్ పాత్రలో మరో హీరోయిన్ ని ఎలా తీసుకోవాలి అనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమా నుండి శృతిహాసన్ నిజంగానే తప్పుకున్నట్టయితే నిర్మాతకి భారీ బడ్జెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సగం షూటింగ్ పూర్తయింది. కాబట్టి మళ్ళీ ఆ షూటింగ్ ని తెరకెక్కించాలంటే బడ్జెట్ భారీగానే అవుతుంది. అలాగే శృతిహాసన్ ఉన్నట్టుండి తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ని వెతికే వేటలో పడ్డారట చిత్ర యూనిట్. అయితే సోషల్ మీడియా నుండి మరో రూమర్ కూడా వినిపిస్తోంది.
అదేంటంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో అడివి శేష్ కి శృతిహాసన్ కి మధ్య ఓ చిన్న గొడవ జరిగి అది కాస్త చిలికిచిలికి గాలి వానలా తయారైందట.అడివి శేష్ తో గొడవ పెట్టుకొని షూటింగ్స్ స్పాట్ నుండి శృతిహాసన్ ఇంటికి వెళ్లి నేను ఇప్పటినుండి ఈ సినిమాలో నటించను అని తేల్చి చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.మరి శృతిహాసన్ నిజంగానే సినిమా నుండి తప్పకుందా లేక సోషల్ మీడియాలో వచ్చేవి రూమర్సేనా అనేది తెలియాల్సి ఉంది.