నారా రోహిత్ పెళ్లాడబోతున్న సిరిలెల్ల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే ..!
సిరిలెల్ల అక్షరాల తెలుగు అమ్మాయేనట.ఈమె ఇక్కడే బ్యాచిలర్ డిగ్రీ ని కూడా పూర్తి చేసిందట.. ఆ తర్వాత పై చదువుల కోసం ఆస్ట్రేలియా కి వెళ్లి అక్కడ మాస్టర్ చేసినట్లు తెలుస్తోంది.. సినిమాల మీద మక్కువ ఉండడంతో తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేసిందట. అలాంటి సమయంలోనే ఈమెకు ప్రతినిధి-2 సినిమా ఆడిషన్స్ కి వెళ్ళాక అక్కడ లక్కీగా హీరోయిన్గా అవకాశాన్ని అందుకున్నది. ప్రతినిధి-2 సినిమా షూటింగ్ సమయంలో రోహిత్, సిరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడడంతో ఆ బాండింగ్ ప్రేమగా మారిందట.
నారా రోహిత్ పెద్దమ్మ భువనేశ్వర్ కి ఈ విషయం చెప్పడంతో ఆమె స్వయంగా ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకొని మరి.. ఈ అమ్మాయి తరఫున వారితో మాట్లాడి దగ్గరుండి అన్నిటిని కుదిరిచినట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. సిరి కుటుంబ సభ్యులు కూడా పెద్ద కుటుంబం కావడం చేత అందులో నారా కుటుంబం సభ్యుల నుంచి వస్తున్న అల్లుడు కావడం చేత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది . అయితే నారా రోహిత్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. పెళ్లి విషయంతో అటు అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు.. మరి వివాహమైన తర్వాత ఆయన నారా రోహిత్ కు కలసి వస్తుందేమో చూడాలి మరి.