బాలయ్య ఎఫెక్ట్ తో చిరుతో సినిమాని వద్దన్న దర్శకుడు.. కానీ చివరకు జరిగింది అదే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యాషన్ సినిమాలకు నందమూరి బాలకృష్ణ ఒకానొక సమయంలో కేరాఫ్ అడ్రస్ గా మారారు  ఈయన సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాలతో పాటు చాలా ప్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటించాడు. ఇక నరసింహ నాయుడు , సమరసింహా రెడ్డి మూవీలు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు గా నిలిచాయి. ఈ మూవీలతో ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలయ్య గుర్తుకు వచ్చే స్తాయికి ఆయన ఎదిగారు. ఈ రెండు సినిమాలకు కూడా బి గోపాల్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి అశ్విని దత్ , బి గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ మూవీ ని చేయాలి అనుకున్నాడట.

అందులో భాగంగా గోపాల్ తో అశ్వినీ దత్ , చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది. దానితో చిరంజీవి తో సినిమా చెయ్ బాగుంటుంది అన్నాడట. ఆయన ఆ కథ మొత్తం విని చిరంజీవి తో ఆ కథతో సినిమా చేయడానికి నిరాకరించాడట. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ ఎందుకు నువ్వు ఆ స్టోరీ తో సినిమా చేయను అంటున్నావు అని అడిగాడట. దానితో గోపాల్ నేను ఇప్పటికే బాలకృష్ణ తో సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్స్ సినిమాలు చేశాను. చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథ కూడా ఫ్రాక్షన్స్ సినిమానే. మళ్లీ అలాంటి కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే నేను చిరంజీవి తో మెకానిక్ అల్లుడు అనే ప్లాప్ సినిమా తీశాను. అలాంటి అనుభవం నాకు చిరంజీవి తో ఉండకూడదు అని అన్నాడట. దానితో పరుచూరి గోపాలకృష్ణ నువ్వు బాలకృష్ణ తో ఫ్యాక్షన్ సినిమా తీశావు. చిరంజీవితో కాదు. చిరంజీవితో ఫ్యాక్షన్ సినిమా తియ్యి కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అన్నాడట. ఆయన మాటలతో కన్విన్స్ అయ్యి ఆ తర్వాత చిరు తో చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో గోపాల్ సినిమా తీయడానికి ఓకే చెప్పాడట. ఆ కథనే ఇంద్ర అనే టైటిల్ తో రూపొందించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: