ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఈయన ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఈయన బ్యానర్ నుండి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకులలో చాలా మంది సూపర్ సక్సెస్ అయ్యారు. ఇకపోతే దిల్ రాజు బ్యానర్ నుండి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కానీ వారిలో వాసు వర్మ ఒకరు. ఈయన జోష్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత కృష్ణాష్టమి అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
ఈ రెండు సినిమాలను కూడా దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే కృష్ణాష్టమి సినిమా ఫ్లాప్ కావడానికి తామే ప్రధాన కారణం అని ఓ ఇంటర్వ్యూ లో దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... వాసు వర్మ "జోష్" మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక కోనా వెంకట్ దగ్గర ఉన్న ఒక పక్క కామెడీ ఎంటర్టైనర్ మూవీ కథను మేము తీసుకున్నాం. ఆ కథ ఓకే అయ్యాక హీరో సెలెక్ట్ కావడానికి చాలా టైమ్ పట్టింది. ఆ గ్యాప్ లో మేము ఖాళీగా ఉండలేదు. ఆ సినిమాలో కథలో అనేక మార్పులు , చేర్పులు చేశాం.
దానితో పక్కా కామెడీ ఎంటర్టైనర్ మూవీ కాస్త ఏదో అయిపోయింది. ఇక ఆఖరిగా సునీల్ హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమాను మేము మార్పులు , చేర్పులు చేసిన విధంగా రూపొందించాం. చివరకు ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మేము కోన వెంకట్ ఇచ్చిన కథను అలాగే తీసి ఉంటే బాగుండేది. మార్పులు , చేర్పులు చేయడం వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.