ఆయన నాతో అంత మాట అన్నాడు.. అందుకే నా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు.. అనిల్ రావిపూడి..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఆ తరువాత ఈయన పటాస్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. మొదటి మూవీ తోనే మంచి విజయం అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమంలో ఈయనకు దర్శకుడిగా సూపర్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి , వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి ప్రముఖ కమెడియన్ సప్తగిరి ఇద్దరు మంచి స్నేహితులు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు. కానీ అని దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా సప్తగిరి లేడు. అందుకు గల కారణాలను కూడా అనిల్ చెప్పుకొచ్చాడు. అనిల్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నాకు సప్తగిరి చాలా క్లోజ్ ఫ్రెండ్. కాకపోతే నేను ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా ఆయన లేడు.

అందుకు కారణం అతనే. ఎందుకు అంటే ...  నాకు ఆయన ఒక రోజు ఫోన్ చేసి నాకు ఏదైనా పాత్ర రాస్తున్నావా ... రాస్తే సినిమా మొత్తం నా పాత్ర ఉండాలి. ఏదో ఒక సన్నివేశంలో వచ్చి వెళ్ళకూడదు. సినిమా మొత్తం నా పాత్ర ఉండేటట్లయితే నేను చేస్తా అన్నాడు. దానితో అంత స్కోప్ ఉన్న పాత్ర ఇప్పటి వరకు దొరకలేదు. అందుకే సప్తగిరి నా సినిమాలో ఇప్పటి వరకు లేడు. తప్పు కచ్చితంగా అతనిదే. చిన్న పాత్ర అయిన చేస్తా అంటే ఇప్పటి వరకు నేను దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో సప్తగిరి ఉండేవాడు అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: