NBK 109 : విడుదల తేదీ అదే.. ఫ్యాన్స్ కి జోష్ నింపే న్యూస్..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఇక ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109 వ సినిమాగా రూపొందుతుంది. దానితో ఈ మూవీ యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. ఈ చిత్రానికి టైటిల్ ను ఫిక్స్ చేయకపోయిన ఈ మూవీ నుండి ఇప్పటికే మూవీ బృందం వారు రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేశారు. వాటికి మాత్రం మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఈ మూవీ లో బాలయ్య సరసన ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. N B K 109 మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ తో పాటు ఈ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: