ఆ ఇద్దరి స్నేహం వల్లే కొరటాల నిలదొక్కుకున్నాడా.. స్నేహానికి విలువనిచ్చిన ఆ ఇద్దరు హీరోలు..?

frame ఆ ఇద్దరి స్నేహం వల్లే కొరటాల నిలదొక్కుకున్నాడా.. స్నేహానికి విలువనిచ్చిన ఆ ఇద్దరు హీరోలు..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు , దర్శకుల మధ్య మంచి స్నేహ బంధం ఉంటూ ఉంటుంది. వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హిట్ కావడం వల్ల వారి స్నేహ బంధం బలపడి ఉండవచ్చు. లేదా మరికొన్ని కారణాల వల్ల కూడా కొంత మంది హీరో , దర్శకుల మధ్య మంచి స్నేహం ఉంటుంది. స్టార్ హీరోలతో మంచి స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్నాడు. కొరటాల శివ , మహేష్ బాబు హీరో గా మొదటగా శ్రీమంతుడు అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత వీరి కాంబోలో భరత్ అనే నేను మూవీ వచ్చింది. ఆ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ తో మొదటగా జనతా గ్యారేజ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక వీరి కాంబినేషన్లో రెండవ సినిమాగా దేవర పార్ట్ 1 అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబోలో దేవర పార్ట్ 2 మూవీ కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఒకానొక ఇంటర్వ్యూలో మహేష్ బాబు ... కొరటాల శివ తో నువ్వు ఏదైనా ప్రాబ్లం లో పడినట్లయితే ఏమీ ఆలోచించకుండా నా దగ్గరికి రా ... నేను నీకు ఏ సహాయం అయినా చేస్తాను అని చెప్పాడు. దానితోనే అర్థం అవుతుంది మహేష్ , కొరటాల స్నేహ బంధం ఎంత బలంగా ఉందా అనేది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా కొరటాల చాలా మంచి ఫ్రెండ్షిప్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అలా కొరటాల ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో మంచి ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: