వెంకటేష్ ఎంతో ఇష్టంగా నటించిన ఆ సినిమాలను కావాలనే ప్లాప్ చేశారా.. అసలు కారణం ఇదే..!

Amruth kumar
 చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే మినిమం గ్యారెంటీ మూవీలు చేస్తుంటారు అందులో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన కెరీర్ మొదటి నుంచి ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ సినిమాలే అవ్వటం విశేషం. ఇదే క్రమంలో ఒకవేళ ఆయన చేసిన సినిమాలు ప్లాఫ్ అయినా కూడా నిర్మాతలకు పెద్ద నష్టాలు వచ్చేవి కావు. అలాంటి సినిమాలనే ఆయన మొదటి నుంచి పెద్దపేట వేస్తూ వచ్చేవారు. అలాంటి వెంకటేష్ కేరీర్‌లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకున్న అప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ఆయనకు పీడ కలల మిగిలిపోయాయి.
 అయితే ఆ సినిమాల్లో కథ బాగున్న అప్పటికీ ప్రేక్షకులు వాటిని చూడలేకపోయారు. ఎక్కడో ఒకచోట తేడా రావటం వల్ల ఆ సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ప్రధానంగా వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమాల్లో దేవీపుత్రుడు సినిమా గ్రాఫికల్గా ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తారు. అలాగే ఈ సినిమా కథ పరంగా ఎంతో బాగుంటుంది. మరి ఇలాంటి సినిమాల‌ ప్రేక్షకులు అప్పట్లో రిసీవ్ చేసుకోవడంలో మాత్రం ఎక్కడో తేడా జరిగింది. చివరగా ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. సీనియర్ దర్శ‌కుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే ప్లాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
అలాగే చింతకాయల రవి సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. ఈ మూవీ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని ఎంతో నవ్విస్తూ వెళుతుంది . అయితే ఈ సినిమాలో కోర్ ఎమోషన్ అనేది సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకులకు చేరువ కాలేక పోయింది. ఈ సినిమా కూడా వెంకటేష్ కెరియర్ లోనే భారీ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇక ఈ రెండు సినిమాల విషయంలో వెంకటేష్ కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడైనా సరే తను ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం కొంతవరకు రిగ్రేట్ ఫీల్ అవుతూ ఉంటాడు. మంచి సినిమాలు చేసిన కూడా ప్రేక్షకులు తనని ఆదరించలేదని చెబుతూ ఉంటాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: