రాజమౌళి కే హ్యాండ్ ఇచ్చిన అల్లరి నరేష్ .. ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యాడుగా..!

Amruth kumar
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే నెంబర్ వన్ దర్శకుడు అని చెప్పాలి. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన జక్కన్న.. తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇచ్చి తొలిసారిగా ఇండియన్ సినిమాకి ఆస్కార్‌ను తీసుకువచ్చాడు. ఇలాంటి దిగ్గజ దర్శకుడు తో సినిమాలు చేయాలని ఎందరో హీరోలు సై అంటున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు రాజమౌళి డేట్లు కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో చేబోతున్నాడు. ఈ సినిమాను కూడా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడు .. అలాంటి రాజమౌళితో గతంలో ఓ స్టార్ హీరో నో చెప్పాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత‌కి ఆ స్టార్ హీరో ఎవరు ఆ సినిమా ఏంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. గ‌తంతో రాజ‌మౌళి సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ కమర్షియల్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లోనే ఈ మూవీ రూ. 34 కోట్ల కు పైగా షేర్ వసూళ్లను సాధించాయి. ఈ మూవీ ప్రారంభానికి ముందు రాజమౌళి సునిల్ గురించి ఆలోచించడం కంటే ముందే పలువురు హీరోలను సంప్రదించాడట.  
ఇక వారిలో  అల్లరి నరేష్ కూడా ఒకరు. ఈ సినిమా స్టోరీ చెప్పగానే చేయడానికి  నరేష్ ఒప్పుకున్నాడు. కానీ ఏడాదికి అరడజన్ కి పైగా సినిమాలు చేస్తూ వచ్చే అల్లరి నరేష్ ని సినిమా పూర్తయ్యేంత వరకు మరో ప్రాజెక్ట్ కి కదలకూడదు అని రాజమౌళి ఓ షరతూ పెట్టాడట. అందుకు అల్లరి నరేష్ ఒప్పుకోలేదట. దీంతో ఈ మూవీ నరేష్ చేతి నుంచి సునీల్ చేతిలోకి వెళ్లింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా అల్లరి నరేష్ కి కూడా సరిపోతుంది అని అనిపించింది. ఎందుకు అంటే ఆయన  తన కెరీర్ లో ఇలాంటి పాత్రలే చాలా ఎక్కువగా చేస్తూ వచ్చాడు. అలా అల్లరి నరేష్ ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ ని వదులుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: