ఏం టాలెంట్ గురూ.. 15 ఏళ్లకే టీమ్ ఇండియాలోకి వచ్చేలా ఉన్నాడే?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ క్రికెట్ నే అమితంగా అభిమానిస్తూ ఉంటారు క్రీడ అభిమానులు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ఇంకొందరు డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ స్టేడియం కు వచ్చి ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక తమ అభిమాన క్రికెటర్లను దేవుళ్ళ లాగా ఆరాధించే ప్రేక్షకులు కోట్లాదిమంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల కాలంలో ఇండియన్ క్రికెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.

 ఐపీఎల్ సహా దేశవాలి క్రికెట్లలో అదరగొట్టి టీమిండియాలోకి వస్తున్నారూ. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక నయ టాలెంట్ తెరమీదకి వచ్చింది. అతని వయసు కేవలం 13 ఏళ్ళు మాత్రమే. కానీ అతని టాలెంట్ చూస్తే ఈ వయసులోనే టీమిండియాలోకి వచ్చేలా కనిపిస్తూ ఉన్నాడు. అతని వయసు 12 నుంచి 13 ఏళ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే రంజీ ట్రోఫీ కూడా ఆడేశాడు. అంటే ఏకంగా క్రికెట్ దిగజాలు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ల కంటే చిన్న వయసులోనే దేశవాలి క్రికెట్ లో అత్యుత్తమమైన ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా అదరగొడుతూ ఉన్నాడు. 13 ఏళ్లకే అండర్ 19 జాతీయ జట్టుకు ఆడుతూ సెంచరీ కూడా నమోదు చేశాడు.

 అది కూడా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీని కొట్టి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు భారత్లో పర్యటిస్తుంది. మొన్నటి వరకు టి20 సిరీస్ ఆడింది. ఇప్పుడు నాలుగు రోజుల మ్యాచ్లో భారత యువ జట్టుతో చెన్నైలో తలబడుతుంది. ఈ మ్యాచ్ లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టాడు ఓ కుర్రాడు. అతను కుర్రాడు కాదు పిల్లాడు మాత్రమే. ఎందుకంటే అతని వయసు 13 ఏళ్లు. అతని పేరు వైభవ్ సూర్యవంశి. 58 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. భారత్ తరపున అత్యంత వేగవంతమైన యూత్ టెస్ట్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. 13 ఏళ్ల వయసుకే ఇలాంటి ప్రదర్శన చేస్తున్న ఇతగాడు.. 15 ఏళ్లకే టీం ఇండియాలోకి వచ్చేలాగే కనిపిస్తూ ఉన్నాడు అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: