స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకి ప్రమాదం..?

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో అక్షయ్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం సినిమా కథలతో ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరో కారుకి  ప్రమాదమైనట్లుగా  వినిపిస్తున్నాయి. ముంబైలోని జూహు ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. నిన్నటి రోజున రాత్రి 8:45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందని అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాతో విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు అక్కడ ఉండే ఒక ఆటో రిక్షాను బలంగా ఢీ కొట్టింది.


ఈ ఘటనలో ఆటో రిక్షా చాలా తీవ్రంగా ద్వంశమయ్యింది. ముఖ్యంగా మెర్సిడేస్ కారు బోల్తా పడినట్టుగా కనిపిస్తోంది. ఈ ఘటనలో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కూడా క్షేమంగా బయటపడ్డారు. ఆటో రిక్ష డ్రైవర్ తో పాటుగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరందరిని దగ్గరలో ఉండే కేర్ ఆస్పత్రిలోకి తరలించగా ,సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మరి దర్యాప్తుని ప్రారంభించారు. అధికారికంగా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయనట్లుగా వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం కారు తోలిన డ్రైవర్ ను  అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఇప్పటివరకు అక్షయ్ కుమార్ కూడా ఏ విధంగా స్పందించలేదు. ప్రమాదం జరిగిన ఈ కారు అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనం అన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత వాటికి సంబంధించి ఎంక్వయిరీ ని అధికారులు పూర్తి చేసిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని తెలియజేస్తున్నారు. యాక్సిడెంట్ కి సంబంధించి  వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే వెల్కమ్ టు ది జంగిల్  అనే మూవీ ఈ ఏడాది విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: