టీవీ: బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?.

Divya
బిగ్ బాస్ -8 తెలుగు సీజన్ ఐదో వారం కొనసాగుతూ ఉన్నది. ఈ వారం మధ్యలోనే ఒక ఎలిమినేషన్ ఉంటుందనే విధంగా ఇటీవల ఒక ఎపిసోడ్లో నాగార్జున తెలియజేశారు.. అయితే ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఉన్నారు. ఇందులో నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, విష్ణుప్రియ, నబిల్, నిఖిల్ అంటే వారు ఉన్నారు. అయితే ఇందులో మిడ్ వీక్ లో ఒకరు ఎలిమెంట్ కాబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

గురువారం మిడ్ వీక్ ఎలివేషన్ లో భాగంగానే హౌస్ నుంచి ఎవరు బయటకి వస్తారు అనే విషయం పైన చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. నామినేషన్ లో ఉన్న వారిలో నబిల్ కు కాస్త ఎక్కువ ఓటు పడినట్లుగా సమాచారం నేటి ఎపిసోడ్ కు సంబంధించిన బిగ్ బాస్ ప్రోమోలో కూడా ఆదిత్య, విష్ణు ప్రియ, నైనిక డేంజర్ జోన్ లో ఉన్నట్లు చూపించారు. అయితే ఈ ముగ్గురిని లగేజ్ సర్దుకోమని కూడా బిగ్ బాస్ ఆదేశాలను జారీ చేశారు.

ఆ తర్వాత ఈ ముగ్గురిలో హౌస్ లో ఉండడానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరో చెప్పారని మిగిలిన హౌస్మేట్స్ సైతం బిగ్ బాస్ సూచించడం జరిగింది.. అయితే ఈ ముగ్గురిలో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆయనను సీక్రెట్ రూమ్ కి పంపించే అవకాశం ఉందని ఎప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది. మరి అందరూ అనుకున్నట్టుగానే ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఒకవేళ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయితే 25 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.. దీన్ని బట్టి చూస్తే ఒక వారానికి రూ .5 లక్షల రూపాయలు బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: