భార్యను క్లీన్ బౌల్డ్ చేసిన కోహ్లీ.. బుంగమూతి పెట్టిన అనుష్క.. వీడియో వైరల్?
అయితే ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారూ. కాగా కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు కోహ్లీ తన ఫ్యామిలీతో హాలిడేస్ ని ఎంజాయ్ చేయడానికి కేటాయిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో గల్లి క్రికెట్ ఆడాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి.
అయితే ఇక ఈ క్రికెట్ మ్యాచ్ లో అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కి కొన్ని రూల్స్ పెట్టింది. ఎవరి వద్ద బ్యాట్ ఉందో వారే ముందుగా బ్యాటింగ్ చేయాలి భారీ షాట్ కొట్టిన వాళ్లే బంతిని కూడా తీసుకురావాలి అంటూ ఒక పెద్ద రూల్స్ చిట్టాను వివరించింది అనుష్క. ఆ తర్వాత ఆట మొదలైంది. ముందుగా అనుష్క బ్యాటింగ్ చేయగా కోహ్లీ బౌలింగ్ వేసాడు. ఈ క్రమంలోనే అనుష్క రెండు సార్లు అవుట్ చేశాడు. దీంతో అనుష్క శర్మ బుంగమూతి పెట్టింది. ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ చేశాడు ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడిన కోహ్లీకి బిగ్ షాక్ ఇచ్చింది అనుష్క. బాల్ దూరంగా ఎవరు కొడితే వాళ్ళే తీసుకురావాలంటూ షాక్ ఇచ్చింది. దీంతో హర్ట్ అయిన కోహ్లీ బ్యాటింగ్ చేయను అంటూ వెళ్లిపోయాడు. ఇది చూసి క్యూట్ కపుల్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.