విడుదలకు ముందే ప్రభంజనం సృష్టించిన దేవర..!!

murali krishna
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవరపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం.. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27 ఎప్పుడొస్తుందా.. సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందా.. చూసేద్దామా అని అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ చేశాయి. త్వరలో మరో ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇక సాంగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను అందుకుని దూసుకుపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఫోర్త్ సింగిల్ రిలీజ్ అవ్వనుంది.అయితే దేవర పార్ట్-1.. రిలీజ్ కు ముందు అనేక రికార్డులు బద్దలు కొడుతూ.. సృష్టిస్తూ అదరగొడుతోంది. ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న దేవర.. వేరే లెవెల్ లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే వన్ మిలియన్ ప్రీ సేల్స్ ను సాధించిన తొలి ఇండియన్ మూవీగా దేవర చరిత్ర సృష్టించింది. అత్యంత త్వరగా 1 మిలియన్ డాలర్స్, 1.5 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.ఇదిలాఉండగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వి జంటగా నటించిన దేవర మూవీ చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్ లో అత్యంత వేగంగా 1.75 మిలియన్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు.అలాగే 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ట్రైలర్, పాటలు మూవీ పై అంచనాలను పెంచేశాయి.మరోవైపు, సెప్టెంబర్ 26వ తేదీన అమెరికా లాస్‌ ఏంజిల్స్‌ లోని ఐకానిక్‌ ఈజిప్షియన్‌ థియేటర్ లో దేవర మూవీని స్పెషల్ గా స్క్రీనింగ్ చేయనున్నారు. అక్కడ ప్రీమియర్‌ కానున్న తొలి ఇండియన్ మూవీగా దేవర -1 రికార్డు క్రియేట్ చేసింది. ప్రతిష్టాత్మక సినిమా వేదిక బియాండ్‌ ఫెస్ట్‌ లో దేవర రెడ్ కార్పెట్ ఈవెంట్ జరగనుంది. అలా.. దేవర రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. మరి విడుదలయ్యాక ఇంకెన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: