ఖాళీ టైం దొరికితే చాలు.. కృతి శెట్టి ఆ పని చేస్తుందట తెలుసా?

praveen
హీరోయిన్ కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అయితే కెరియర్ తొలినాళ్ళల్లో లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. దీంతో ఎంతో మంది డైరెక్టర్లు తమ సినిమాల్లో ఈ హీరోయిన్ కి ఛాన్స్ లు ఇచ్చారు. కానీ ఆ తర్వాత కాలంలో సరైన కథలను ఎంచుకోవడంలో ఈ అమ్మడు కాస్త తడబడింది. దీంతో కృతి శెట్టి చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఇక ఈ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు ఒక్కసారిగా సాగిపోయాయి.

 అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గానే గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అందం అభినయంతో మాత్రమే కాదు అద్భుతమైన నటనతో డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో కూడా ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్. ఇక చూడ్డానికి ఎంతో క్యూట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. కుర్రకారూ గుండెల్లో ఎప్పుడూ గుబులు పుట్టిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కృతి శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అందం యొక్క రహస్యం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.

 హౌ టు బి గార్జియస్ అనే పుస్తకం చదవడం ద్వారా తన బ్యూటీ రెట్టింపు అయ్యింది అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. షుగర్ ప్రోడక్ట్ లకు తాను దూరంగా ఉంటాను అంటూ తెలిపింది. దీంతో చర్మం లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకు స్ఫూర్తి అంటూ తెలిపింది. అదే సమయంలో తాను ఖాళీగా ఉంటే ఏం చేస్తాను అన్న విషయాన్ని కూడా చెప్పింది. సాధారణంగా ఖాళీ సమయం దొరకదని ఒకవేళ ఖాళీ సమయం దొరికిందంటే తప్పకుండా ఏరియల్ యోగ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఫ్రీ టైం దొరికితే ఇక ఎక్కువగా డాన్స్ చేయడం నాకు ఎంతో ఇష్టం అంటూ కృతి శెట్టి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: