అవకాశాల కోసం శరీరం అమ్ముకోను.. హీరోయిన్ హట్ కామెంట్స్..!
ముఖ్యంగా దర్శక, నిర్మాతల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరి తెలియజేస్తోంది.. టెక్నికల్ పరంగా సమాజం ఎంత మారినప్పటికీ మహిళలు ఎంత చదువుకున్న అన్ని రంగాలలో మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి అంటు తెలుపుతోంది. తమిళ ఇండస్ట్రీలో జరిగేటువంటి అరాచకాలు చెప్పడానికి ఎవరు ముందుకు రారని తాను కూడా అలాంటి ఎన్నో చేదు సంఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది సనమ్ శెట్టి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఎందుకు మాట్లాడరో అర్థం కాలేదని కూడా తెలుపుతోంది.
గడచిన కొద్ది రోజుల క్రితం కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ సంఘటనను వరలక్ష్మి వ్రతం సందర్భంగా సనమ్ శెట్టి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టగా వివాదాస్పదంగా మారింది. మహాలక్ష్మి దేవి పూజను సైతం అందరూ జరుపుకుంటారు మన మధ్య నడిచే దేవతలు అత్యాచారానికి, హత్యకు గురవుతున్న సమయంలో ప్రాణాలు కాపాడే దేవదూత లాంటి డాక్టర్లను సైతం అతి కిరాతకంగా హత్య చేశారు.. దీంతో కోల్కత్తాలో ఒక ఉద్యమమే ప్రారంభం అయ్యింది నేను దీనిని చెన్నైలో క్లైమ్ ది నైట్ గా ప్రారంభించాలనుకుంటున్నాను అంటూ తెలిపింది. ఆడపిల్ల అనుమతి లేకుండా ఎవరు తాకకూడదు తాను కూడా ఒక నటిని కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడమే తన వృత్తి అంతేకానీ అవకాశాల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూ పలు రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది.