బాలయ్య -109 : సంక్రాంతికి ఫిక్స్ అయినట్టేనా..?
కానీ డిసెంబర్లో పుష్ప-2, గేమ్ చేంజర్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దీంతో బాలయ్య సినిమా రిలీజ్ ఎందుకని భావించిన మేకర్స్ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేశారు. బాలకృష్ణ సినిమా సంక్రాంతికి విడుదలయితే ఖచ్చితంగా బాక్సాఫీసు లెక్కలు వేరే లాగా ఉంటాయని చెప్పవచ్చు సంక్రాంతికి బాలయ్య విడుదల చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలని అందుకున్నాయి. అందుకే తన 109వ చిత్రాన్ని కూడా అప్పుడే విడుదల చేసేలా భావిస్తున్నారు.
అయితే సంక్రాంతికి చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా ఎప్పుడో ఫిక్స్ చేశారు. అలాగే వెంకటేష్. అనిల్ రావు పూడి చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య వెంకటేష్ చిరంజీవి ఇలా ముగ్గురు సీనియర్ హీరోలు పోటీ పడబోతున్నారు. గతంలో బాలయ్య సంక్రాంతి పోటీలో ఎన్నోసార్లు విజయాన్ని అందుకున్నారు. ఇదంతా ఓకే అయితే నాగార్జున ఏదైనా సినిమాతో సంక్రాంతికి వస్తే సీనియర్ల హవా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో ఉంటుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి సంక్రాంతికి ఏది రిలీజ్ అవుతుంది ఏది పోస్ట్ ఫోన్ అవుతుందనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. మరి బాలయ్య విషయం పైన కూడా చిత్ర బంధం క్లారిటీ ఇస్తూనే చూడాలి