యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం యమదొంగ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో యముడికి పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించాడు . ఈ సినిమా భారీ అంచనాలు నడుమ ధియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కి ఎస్ ఎస్ రాజమౌళి కి అలాగే ఈ సినిమాలో యముడి పాత్రలో నటించిన మోహన్ బాబు కు అద్భుతమైన గుర్తింపు లభించింది.
ఇకపోతే ఈ సినిమాలో యముడి పాత్ర కోసం మొదట రాజమౌళి , మోహన్ బాబు ను కాకుండా మరో నటుడిని అనుకున్నాడట. కాకపోతే ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోవడంతో ఆ తర్వాత మోహన్ బాబు ను తీసుకున్నారట. అసలు ఆ నటుడు ఎవరు ... ఎందుకు ఈ సినిమా చేయలేదు అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం యముడు పాత్రలలో కైకాల సత్యనారాయణ నటించారు. అలాగే ఈయన సీనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యమగోల సినిమాలో కూడా యముడి పాత్రలో నటించాడు.
దానితో రాజమౌళి "యమదొంగ" సినిమాలో కూడా యముడి పాత్రలో ఆయన నటిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించాడట. ఇక కథ మొత్తం విన్న సత్యనారాయణ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాకపోతే ఆ తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో ప్రాబ్లమ్ రావడంతో ఆయన ఈ సినిమా చేయలేదట. దానితో రాజమౌళి , మోహన్ బాబును ఈ పాత్ర కోసం సంపాదించడం , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా యమదొంగ సినిమాలో యముడి పాత్రలో మోహన్ బాబు నటించినట్లు తెలుస్తోంది.