అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుణ్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాతో ఈ బ్యూటీ కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ పలు తెలుగు సినిమాలలో నటించింది. కానీ వాటి ద్వారా పెద్ద స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. మల్లి ఈమె తెలుగులో వరుస పెట్టి సినిమాలలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం తెలుగులో ఈమె వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలలో పర్వాలేదు అనే స్థాయిలోనే అందాలు ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి కొంటె చూపులతో కవ్విస్తున్న విధంగా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.