రివ్యూ: విక్రమ్ తంగలాన్ ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే..?
హీరో విక్రమ్ అసాధారణమైన నటుడని ఎన్నోసార్లు ఎన్నో చిత్రాలలో రుజువు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేశారు అసలు హీరోయిజాన్ని తంగలాన్ సినిమాలో అద్భుతంగా నటించారు. తన కెరియర్ లోని బెస్ట్ సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. విక్రమ్ పైన ఈ సినిమా చూసిన వారందరూ కూడా ప్రశంశాల సైతం తెలియజేస్తున్నారు. హీరో విక్రమ్ కి సినిమా పట్ల ఉన్న ప్రేమను ప్రస్తావిస్తూ అభిమానులు ట్విట్టర్లో కూడా# thangalaan అంటూ ట్రెండ్ చేస్తున్నారు. హీరో విక్రమ్ ఇంతటి గొప్ప నటుడు ఎలా అయ్యారో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంటే సినిమా చూసిన ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
తంగలాన్ చిత్రం కోసం ఫిజికల్ గా మెంటల్ గా ఎలా ప్రిపేర్ అయ్యారో ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విక్రమ్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ మరొక నెటిజెన్ ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు. హీరోయిన్ మాళవిక డాన్స్ తో పాటు డి గ్లామరస్ పాత్రలో అద్భుతంగా నటించిందని ఆడియోస్ తెలియజేస్తున్నారు. మొదటి భాగం విక్రమ్ నటనతో నెక్స్ట్ లెవెల్ లో ఉందని మాళవిక నటన కూడా చాలా అద్భుతంగా నటించిందని.. సెకండ్ హాఫ్ లో విక్రమ్ బాడీ లాంగ్వేజ్ చూసిన ఆడియన్స్ కచ్చితంగా ఆశ్చర్యపోతారని.. అలాగే ఫైట్ సీన్ సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయంటూ ట్విట్టర్లో తెలుపుతున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఏడిపించేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని తెలుపుతున్నారు. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పైన ఎలాంటి ఆదరణ లభిస్తారో చూడాలి. మొత్తానికైతే విక్రమ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారని అభిమానులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ క్రెటిక్ గా పేరుపొందిన ఉమైర్ సందు వంటి వారి ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారట.