మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మరో వారసుడు వచ్చేస్తున్నాడు..?

Divya
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు.. వివాహమైన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. చివరిగా లావణ్య నటించిన చిత్రం హ్యాపీ బర్తడే ఆ తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు. కేవలం అడపాదడపా వెబ్ సిరీస్లలో టీవీ షోలో మాత్రమే కనిపిస్తోంది. లావణ్య త్రిపాఠి సినిమాలుకు ఒప్పుకోకపోవడానికి ముఖ్య కారణం ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.

తాజాగా బయటకు వచ్చిన కొన్ని వీడియోలు అలాగే తిరుమల కు దర్శనానికి వచ్చిన తీరులో తన భర్తతో కలిసి వచ్చినప్పుడు కూడా ఆమె తన పొట్టను సైతం కవర్ చేస్తే అభిమానులకు కనిపించింది. దీంతో అభిమానులు ఈ విషయాన్ని తెగు వైరల్ గా చేస్తున్నారు. బేబీ బంప్స్ ఫోటో కనిపించకుండా లావణ్య త్రిపాఠి చాలా జాగ్రత్త పడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాను ధరించిన చీరతో ఈ పొట్టను సైతం కవర్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో తెగ వైరల్ గా మారుతుంది అయితే ఈ విషయాన్ని అటు లావణ్య కుటుంబం కాని మెగా కుటుంబం కానీ బయట పెట్టలేదు.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. లావణ్య చీరతో కవర్ చేసుకున్నటువంటి ఈ పద్ధతి వల్ల ఆమె అభిమానులు కూడా త్వరలోనే లావణ్య త్రిపాఠి మెగా వారసుడిని ఇవ్వబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మెగా ఫ్యామిలీ ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. గడిచిన నెల నుంచి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు. మరి ఈ విషయం పైన ఏవిధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: