గ్రాండ్ గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్.. పిక్స్ వైరల్..!!

murali krishna
మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్‌‌ ప్రస్తుతం దేవర, వార్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక దేవర మూవీ సెప్టెంబర్‌ 27న విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే ఎన్టీఆర్‌ దేవరతో పాటే ప్రశాంత్‌ నీల్‌తో  ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. NTR31 అనేది వర్కింగ్ టైటిల్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రాబోతుందని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రకటన ఇచ్చింఇ. అప్పటికే ప్రశాంత్‌ నీల్‌ సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవరకు కమిట్‌ అయ్యాడు.ఇక ఎన్టీఆర్‌ దేవర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. వార్‌ 2లో ఎన్టీఆర్‌ షెడ్యూల్‌ కూడా దాదాపు పూర్తయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ రిలీజ్‌ తర్వాత కాస్తా రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో ప్రశాంత్‌ సలార్‌ 2 షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లో సైలెంట్‌గా NTR31ను ప్రారంభోత్సవ వేడుకను జరిపించేశారు. ఎలాంటి ప్రకటన లేకుండ గప్‌చుప్‌గా ఇవాళ ఆగష్టు 9న NTR31 సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌ రామనాయుడు స్టూడియోస్‌లో జరిపించారు.ఎన్టీఆర్‌ 31 ప్రారంభ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. అయితే.. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు రిలీజ్ చేసారు. కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు.. సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే.. కెజియఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. 

పైగా ఎన్టీఆర్ తన అభిమాన హీరో కావడమే కాదు, ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. మామూలుగానే నీల్ తన హీరోలను నెక్స్ట్ లెవల్ అనేలా చూపిస్తుంటాడు. అలాంటిది ఎన్టీఆర్‌ను ఇంకే రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమా ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇలాంటి విషయాల్లో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో కలిసి హాజరయ్యాడు. ఇక ప్రశాంత్‌ నీల్‌ కూడా సతీసమేతంగా వచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అధినేతలు, కళ్యాణ్‌ రామ్‌తో పాటు మరికొందరు నటీనటులు హాజరైనట్టు తెలుస్తోంది. సైలెంట్‌గా జరిపించిన ఈ మూవీ పూజ కార్యక్రమానికి బయట వారిని ఎవరిని అనుమతించలేదు. ఈ సినిమాకు సంబంధం లేని వారెవరికి ఆహ్వానం లేనట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఏదేమైనా NTR31 మూవీ ప్రారంభం కావడంతో నందమూరి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు అప్పుడే మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమా 2026లో జనవరి 9న విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: