టాలీవుడ్ ను నిరాశపరచిన జూలై.. ఆగస్టు పైనే తెలుగు పరిశ్రమ ఆశలు..?

frame టాలీవుడ్ ను నిరాశపరచిన జూలై.. ఆగస్టు పైనే తెలుగు పరిశ్రమ ఆశలు..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో ఈ సంవత్సరం విజయాలు తక్కువ గానే కనబడుతున్నాయి. ఇప్పటికే సగం సంవత్సరం కంప్లీట్ అయిన తెలుగు సినీ బాక్సాఫీస్ దగ్గర చాలా తక్కువ  విజయాలే నమోదు అయ్యాయి. ఇక జూన్ నెల చివరలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా విడుదల అయింది. ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా ఇప్పటికే 10 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకపోతే జూలై నెల మాత్రం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద నిరాశనే మిగిలింది. ఈ నెలలో చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఏ సినిమా కూడా ఆశించదగ్గ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు.

ఇక జూలై నెల ఇప్పటికే కంప్లీట్ అయింది. దానితో తెలుగు సినీ ప్రేమికులు అంతా ఆగస్టు నెలపై ఫోకస్ పెట్టారు. ఎందుకు అంటే ఆగస్టు నెలలో అనేక తెలుగు సినిమాలు విడుదల కాపడానికి రెడీగా ఉన్నాయి. అందులో భారీ అంచనాలతో విడుదల కాబోయే సినిమాలలో డబల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ , ఆయ్ , సరిపోదా శనివారం సినిమాలు ఉన్నాయి. ఇందులో డబల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ , ఆయ్ సినిమాలు ఆగస్టు 15 వ తేదీన విడుదల కానున్నాయి.

ఈ మూడు సినిమాలపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే సరిపోతా శనివారం సినిమా ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ నెలలో తెలుగు బాక్స్ ఆఫీస్ కు సూపర్ సక్సెస్ కల్కి మూవీ ద్వారా అందింది. కానీ జూలై నెల మాత్రం తీవ్ర నిరుత్సాహ పరిచింది. మరి ఆగస్టు నెలలో మంచి క్రేజ్ ఉన్న అనేక తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: