కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.కేవలం తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.విభిన్నమైన కథలతో, తన నటనతో సినిమాలు చేస్తూ ఉన్నారు విక్రమ్. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు చియాన్. వాస్తవానికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు విక్రమ్ కెరీర్ లో వచ్చిన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్.ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా కూడా అవేవి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. అయినా సరే విక్రమ్ కు ఆఫర్లు ఎక్కడా తగ్గలేదు.ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అన్ని అవాంతారాలు దాటి ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది.
కేవలం తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి.ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అది కూడా ఎలాంటి కట్స్ లేకుండా అందించినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే సినిమా అధికారిక రన్ టైం గా 156 నిమిషాల 59 సెకండ్స్ గా కట్ చేశారట. అంటే సినిమా రెండు గంటల 36 నిమిషాల 59 సెకండ్ల పాటు థియేటర్స్ లో కొనసాగనుంది. విక్రమ్ పెర్ఫామెన్స్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పా రంజిత్ ఏ లెవెల్లో ప్లాన్ చేసాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ లో నటించగా జివి ప్రకాష్ సంగీతం అందించాడు అలాగే ఈ ఆగస్ట్ 15న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా కోసం ఏకంగా 35 కేజీలు తగ్గినట్లు టాక్. అలాగే ఈ మూవీలో విక్రమ్ కు ఎలాంటి డైలాగ్స్ ఉండవని తెలుస్తోంది. దీంతో ఈ పై అభిమానులలో అంచనాలు మరింత మించిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.