వరుణ్ తేజ్ను జంతువుతో పోల్చిన చిరు.. బన్నీని ఏమన్నాడంటే..?

lakhmi saranya
టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చిరు . 68 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు . ఇక ప్రస్తుతం విశ్వంభరా చిత్రంలో బిజీగా ఉన్నాడు చిరు . ఇటు చిత్రాలతో పాటు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తూ లైఫ్ను లీడ్ చేస్తున్నాడు .

ఇక ఇదిలా ఉంటే గతంలో ఖైదీ నెంబర్ 150 మూవీ ప్రమోషన్ సమయంలో చిరంజీవి .‌. రామ్ చరణ్ అండ్ వివి వినాయకులను నిహారిక ఇంటర్వ్యూ చేసింది . ఈ ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు . ర్యాపిడ్ ఫైర్ గ్రౌండ్లో చిరంజీవిని .‌.. హీరో పేరు వినగానే ఒక్క మాటలో వర్ణించాలని నిహారిక కోరింది ‌. అలా ఫస్ట్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పగా .. ఇంట్రావర్ట్ అని చిరంజీవి సమాధానం ఇచ్చారు . అనంతరం రామ్ చరణ్ పేరు చెప్పగా వాడు కూడా బాబాయి వలె ఇంట్రావర్ట్ అని అన్నారు . ఇక వరుణ్ తేజ్ పేరు చెప్పగా వాడు జిరాఫీ అని అన్నాడు చిరు .

అలా వరుణ్ని చిరంజీవి జంతువుతో పోల్చడం ఆసక్తి రేపుతుంది. అయితే వరుణ్ హైట్ ని ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్ చేసినట్లు సమాచారం . అనంతరం అల్లు అర్జున్ పేరు పలికింది నిహారిక . ప్యాక్ ఆఫ్ ఎనర్జీ అని బన్నీ గురించి చిరంజీవి ఒక్కమాటలో చెప్పేసాడు . ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యామిలీ మరియు ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే . ఇటువంటి వార్ లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: