ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది దర్శకులు దర్శకత్వం వహించిన మొదటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్న ఆ తర్వాత మాత్రం విజయాలను అందుకుంటూ సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకున్న వారు ఉన్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో అపజయాన్ని అందుకొని ఆ తర్వాత విజయాలతో కెరియర్ను మంచి స్థాయిలో ముందుకు సాగిస్తున్న దర్శకులు ఎవరో తెలుసుకుందాం.
హరీష్ శంకర్ : ఈయన రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్గా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు మిరపకాయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ "గబ్బర్ సింగ్" మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏకంగా బ్లాక్ బాస్టర్ అయ్యింది. ప్రస్తుతం హరీష్ శంకర్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.
వంశీ పైడిపల్లి : ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా ఇలియానా హీరోయిన్గా రూపొందిన మున్నా అనే మూవీ తో దర్శకుడిగా కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు బృందావనం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ దర్శకుడు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో అనేక మూవీలు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం వంశీ పైడిపల్లి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకుడిగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.