దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడితో ఒక హీరో సినిమా చేశాడు అంటే వారి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే రెండవ సారి కూడా వారి కాంబోలో సినిమా రావాలి అని ఆ హీరో అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మొదటి సినిమాతో అద్భుతమైన విజయం దక్కిన కాంబోలో రెండవ సినిమా కనుక రూపొందుతుంది అంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. సినిమా కథలో కానీ , కథనంలో కానీ ఏదైనా కాస్త లోపం జరిగిన ఆ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది.
అదే అన్ని పర్ఫెక్ట్ గా కుదిరి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిచే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో చూడాలని ఉంది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ తో దర్శకుడిగా గుణశేఖర్ కి సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. ఇలా చిరు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత చిరంజీవి , గుణశేఖర్ కి రెండవ అవకాశం ఇచ్చాడు.
దానితో గుణశేఖర్ , చిరంజీవి హీరోగా మృగరాజు అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా చూడాలని ఉంది సినిమాతో మంచి విజయం ఇచ్చిన దర్శకుడిని నమ్మి చిరంజీవి రెండవ అవకాశం ఇచ్చాడు. కానీ రెండవ అవకాశంలో గుణశేఖర్ , చిరంజీవి కి మంచి విజయాన్ని అందించలేకపోయాడు.