విశ్వం : అందరికీ హిట్ కావాలి.. కానీ కంటెంట్ మాత్రం అలా..?

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో నటిస్తున్న హీరో , హీరోయిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శ్రీను వైట్ల , నిర్మిస్తున్న విశ్వ ప్రసాద్ అందరికీ ప్రస్తుతం వరుస అపజయాలు ఉన్నాయి. దానితో వీరంతా కూడా ప్రస్తుతం విజయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే గోపీచంద్ అఖరుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీమార్ సినిమాతో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత ఈయన నటించిన ఏ సినిమా కూడా కనీసం యావరేజ్ విజయాన్ని కూడా అందుకోలేదు. దానితో ఈయన ఎలాగైనా విశ్వం మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని కొట్టాలి అనే కసితో ఉన్నాడు. ఇక కావ్య దాపర్ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్న ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోవడం లేదు. దానితో ఈ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టాలి అనే కసితో ఉంది. శ్రీను వైట్ల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక ఈ మూవీ తో ఎలాగైనా ఒక మంచి విజయాన్ని అందుకొని తిరిగి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలి అని ఈ దర్శకుడు ఎదురు చూస్తున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ వరుసగా సినిమాలను నిర్మిస్తున్న ఈయన బ్యానర్లో విజయాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి.

అలాగే ఈ మధ్య కాలంలో ఈయన తెరకెక్కించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో విశ్వం మూవీ తో మంచి విజయాన్ని అందుకోవాలి అని విశ్వ ప్రసాద్ కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వీరందరూ కూడా విశ్వం మూవీ తో మంచి విజయాన్ని అందుకోవాలి అని చూస్తున్నారు. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో ... బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: