ఎక్కడి నుంచి వచ్చిందో కానీ బైక్‌లో దూరిన భారీ పాము.. చివరికి ఏమైందంటే?

Suma Kallamadi
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనుషులకే కొన్ని ప్రాంతాల్లో నిలువ నీడ కరువు అవుతోంది. ఇలాంటి సమయంలో పాములు, తేళ్లు వంటి విషపూరిత జీవులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. వెచ్చగా ఉన్న ప్రాంతాలను అన్వేషిస్తూ ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇళ్లల్లోని మూలల్లో, షూలలో దూరుతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉంటే పాము కాటుతో మనుషులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక పాములు అనే పేరు వింటేనే చాలా మంది భయపడతారు. అందులోనూ భారీగా పొడవు ఉంటే పాములు అయితే గుండె జారిపోతుంది. అయితే వీటిని దగ్గరగా చూసి ప్రాణభయంతో పరుగులు పెడుతుంటారు. ఇదే కోవలో ఓ వ్యక్తి ఎప్పటిలాగే తన బైక్ వద్దకు వెళ్లాడు. దానిపై కూర్చునే సమయంలో అతడికి అందులో పాము కనిపించింది. దీంతో బైక్ దిగి ఆ వ్యక్తి పరుగులు పెట్టాడు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా అతడి ప్రాణాలు పోయేవి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు కోర్టు ఆవరణలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ భారీ పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, అది నేరుగా పార్కింగ్ ప్రాంతంలోకి వెళ్లింది. ఓ బైక్‌లో దూరింది. చక్కగా బైక్‌లో రెస్ట్ తీసుకుంటోంది. అయితే బైక్ యజమానికి ఈ విషయం తెలియదు. దీంతో ఎప్పటిలాగే తన బైక్ వద్దకు వచ్చాడు. దానిపై కూర్చునే సమయంలో బైక్‌లో భారీ పాము ఉండడం గమనించాడు. వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అతడు బైక్‌పై కూర్చుంటే పాము కాటుతో ఖచ్చితంగా అతడి ప్రాణాలు పోయేవి. అదృష్టవశాత్తూ తృటిలో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఇక ఆ పాము కూడా బైక్ నుంచి బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే బైక్ నుంచి రాలేక అవస్థలు పడింది. బైక్‌లో పాము దూరిన విషయాన్ని స్థానికులు స్నేక్ క్యాచర్‌కు తెలిపారు. అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ సైతం పామును బైక్ నుంచి బయటకు తీయడానికి చాలా శ్రమించాడు. ఎట్టకేలకు బైక్ ఇంజిన్‌లో ఇరుక్కున్న పామును ఆ స్నేక్ క్యాచర్ బయటకు తీశాడు. తర్వాత దానిని నిర్మానుష్య ప్రాంతంలో విడిచి పెట్టాడు. దీంతో కోర్టు ఆవరణలో ఉన్న అడ్వకేట్లు, పోలీసులు, ఇతర సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: