మహేష్ ఎంత గొప్ప హీరో అని చెప్పడానికి ఇదే ఉదాహరణ?

Purushottham Vinay

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా మహేష్ బాబు క్రేజ్ వల్ల లాంగ్ రన్ లో ఏకంగా 250 కోట్ల దాకా గ్రాస్ వసూళ్ళని సాధించింది. దీంతో ఈ సినిమాతో మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. పైగా ఈ సినిమాలోని పాటలు కూడా స్లోగా జనాల్లోకి ఎక్కి చార్ట్ బ్లస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి పాట అయితే గ్లోబల్ సెన్సేషన్ అయింది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ సినీ కెరీర్ లో అనవసరంగా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే వేరే లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేవి. అలాంటి సినిమాలలో టక్కరి దొంగ సినిమా కూడా ఒకటి. జనాలు రొటీన్ సినిమాలకు అలవాటు పడ్డ టైములో సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాతో కొత్త ప్రయోగం చేశాడు. ఈ సినిమాలో డూప్ లేకుండా రిస్కీ షాట్స్ కూడా చేశాడు మహేష్. కానీ తన పెర్ఫార్మన్స్ తో మెప్పించినా కానీ ఈ సినిమా నిర్మాతలకు మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది. 


పైగా ఈ సినిమాకు దర్శకుడు నిర్మాత ఒక్కరే కావడం గమనార్హం. సీనియర్ స్టార్ డైరెక్టర్ జయంత్. సి. పరాన్జీ ఈ సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా హిట్టు కొడితేనే మహేష్ రెమ్యూనరేషన్ తీసుకుంటా అని డైరెక్టర్ కి చెప్పేసాడు. కానీ ప్లాప్ అయ్యింది.అయినా కూడా రెమ్యునరేషన్ తీసుకోవాలని జయంత్ మహేష్ బాబుకు సూచిస్తే మహేష్ బాబు మాత్రం సినిమా ఫ్లాపై ఇప్పటికే నష్టాలు వచ్చాయి కదా అయినా నాకెందుకు రెమ్యునరేషన్ అని చెప్పి తన మంచి మనసు చాటుకున్నాడని డైరెక్టర్ జయంత్ చెప్పాడు. దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి హీరో అని ఆయనను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ డైరెక్టర్ రాజమౌళితో ఫస్ట్ టైం ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: