భారతీయుడు 2 క్లోజ్.. ఎన్ని కోట్ల నష్టం అంటే?

Purushottham Vinay

సీనియర్ హీరో విశ్వనటుడు కమల్ హాసన్ ఎన్నో అంచనాలతో ఎంతో కష్టపడి హీరోగా నటించిన తాజా చిత్రమే 'భారతీయుడు 2'. తమిళ లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.విక్రమ్ మూవీతో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్న తర్వాత కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. రిలీజ్ కి ముందు నుంచే ఈ మూవీ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా గట్టి పోటీ ఏర్పడింది. దాని ఫలితంగా తెలుగులో రూ. 24 కోట్లు బిజినెస్ చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలని కలుపుకొని కలుపుకుని ఈ సినిమా రూ. 170 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

రెండు వారాలు పూర్తయ్యాక 'భారతీయుడు 2' సినిమాకు ఈ విధంగా వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకి తమిళనాడులో రూ. 52.85 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.45 కోట్లు, కర్నాటకలో రూ. 9.30 కోట్లు, కేరళలో రూ. 5.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.30 కోట్లు ఇంకా అలాగే ఓవర్సీస్‌లో రూ. 50.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఇలా ఇప్పటికి ఈ సినిమా రూ. 150.30 కోట్లు గ్రాస్, రూ. 72.85 కోట్లు షేర్‌ను మాత్రమే వసూళ్ళని రాబట్టింది.కమల్ హాసన్ ఎన్నో అంచనాలతో చేసిన 'భారతీయుడు 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు బిజినెస్ చేయగా.. 2 వారాలు అయ్యాక కేవలం రూ. 72.85 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే.. ఇంకా రూ. 99.15 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. ఇక, తెలుగులో సినిమాకి రూ. 24 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 25 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ హిట్‌కు ఇంకా రూ. 11.45 కోట్లు వెనుకబడి ఉంది. ఇప్పుడు దాదాపు చాలా థియేటర్స్ నుంచి ఈ సినిమా తొలగిపోయింది. ఈ సినిమా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే ఓటిటిలోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: