కల్కి: 30 రోజుల్లో ఊచకోత.. కానీ సినిమాల కంటే వెనకే?

Purushottham Vinay

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. జూన్ 27 వ తేదీన ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. దీనికి మంచి టాక్ రావడంతో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే లభించింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకా పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకి 30 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయంటే..


కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది కాబట్టి ఈ సినిమాకి 30 రోజుల్లో తెలుగులో రూ. 183.04 కోట్లు, తమిళంలో రూ. 21.67 కోట్లు, కర్నాటకలో రూ. 35.65 కోట్లు, కేరళలో రూ. 12.80 కోట్లు, హిందీలో రూ. 143.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 128.95 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 550 కోట్లు షేర్, రూ. 1125 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇక 'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 371 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 30 రోజుల్లో ఈ సినిమాకి రూ. 550 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 179 కోట్ల లాభాలతో ఈ సినిమా రికార్డులు నమోదు చేసింది. యానిమల్, పఠాన్, జవాన్ వసూళ్ళని దాటేసిన ఈ సినిమా ఇంకా కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ వసూళ్ళకి మాత్రం దూరంలో ఉంది. మరి ఆ సినిమాల వసూళ్ళని కూడా కల్కి దాటుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: