వామ్మో: రాయన్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో ధనుష్ ఊచకోత..!

Divya
తమిళంలో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్ నటించిన తాజా చిత్రం రాయన్.. ఈ చిత్రం తన కెరీర్లో 50వ చిత్రం కావడం చేత తానే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో సందీప్ కిషన్, జయరామ్, అపర్ణ బాలమురళి తదితర నటినటులు కీలకమైన పాత్రల నటించారు. నిన్నటి రోజున ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని మూటకట్టకుంది.

అయితే మొదటి రోజు కలెక్షన్స్ విషయంపైన అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు.. ట్రెండ్ వర్గాల నుంచి తెలుపుతున్న సమాచారం ప్రకారం మేకారం మొదటి రోజే 12.5 కోట్ల రూపాయలు రాబట్టిందని తెలుగు వర్షన్ ఒక్కటే 1.5 కోట్ల రూపాయలు రాబట్టగా తమిళంలో 11.5 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.. అలాగే తమిళంలో రాయన్ చిత్రానికి 58% ఆక్యుపెన్సి నమోదయింది ఈరోజు రేపట్లో ఈ సినిమా కలెక్షన్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రెండ్ నిపుణులు తెలియజేస్తున్నారు.

సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇందులో ధనుష్ (రాయన్) పాత్రలో కనిపించబోతున్నారు..తమ్ములుగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ నటించారు.. చెల్లెలుగా దుశారా విజయన్ నటించింది. అయితే వీరంతా చిన్న వయసులో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు బయటికి వెళ్లి తిరిగి వస్తామని చెప్పి అలా తిరిగి రాకుండా ఉంటారు అయితే వారు ఏమయ్యారో తెలియక ఊర్లు తమకు తెలిసిన వ్యక్తి.. తన చెల్లిని అమ్మాలని చూసిన తల్లిదండ్రులను రాయని చంపేసి ఊరు నుంచి బయటికి వచ్చి మరి బతుకుతూ ఉంటారు.. అయితే ఊరు బయట ఉన్నప్పటికీ తన కుటుంబ బాగోగులను దగ్గరుండి మరి చూసుకుంటూ ఉంటారు రాయన్. అయితే అనుకోకుండా ఒక గొడవలో దూరి అందులో దొరై అనే వ్యక్తి మరణిస్తారు.. ఆ తర్వాత రాయన్ నీ చంపాలని  సీతారాం అనే వ్యక్తి చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత రాయన్ ఏం చేశారు కుటుంబం కోసం అనే విషయం తెలియాలి అంటే తెలపైన చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: