పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవన్ ను కలవబోతున్న రేణు దేశాయ్..!
రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత మరొక నటిని పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లల బాధ్యతను చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది.ఇదంతా ఇలా ఉంటే.. అభిమానులకు మాత్రం రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ని జంటలుగా చూడడం చాలా ఆనందంగా ఉంటుందట.. పర్సనల్ గొడవల వల్ల విడిపోయిన వీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుందని అభిమానుల కోరిక.. అయితే ఇప్పటికి అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ మల్లి కలవబోతున్నారని ఒక వార్త వైరల్ గా మారుతున్నది.
ప భగవద్గీత ఫౌండేషన్ వేదికకు చీప్ అడ్వైజర్ గా రేణు దేశాయ్ నిన్నటి రోజున జూబ్లీహిల్స్ లో ఉండే అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా పేరుపొందిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇంటికి ఫార్మల్గానే వెళ్ళింది..అలాగే గీత యూనివర్సిటీ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా రేణు దేశాయ్ మంత్రి సురేఖకి వివరించారట. దీంతో రేణు దేశాయ్ నీ మంత్రి సురేఖ బంగారు గొలుసు బట్టలు పెట్టి మరి సత్కరించి పంపించింది.
ఇలాంటి సమయంలోనే వచ్చేవారం ఆంధ్రప్రదేశ్లో ఆనం రామనారాయణరెడ్డిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రాలో పెద్ద వాళ్లతో మాట్లాడే అవకాశాలు రేణు దేశాయ్ కు కల్పించినట్లు తెలుస్తోంది. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. భగవద్గీత ఫౌండేషన్ వేదికగా అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ ను రేణు దేశాయ్ కలవబోతూ ఉండడంతో అభిమానులు ఈ విషయంపై ఫుల్ ఖుషి అవుతున్నారు.